Raja Sekhar CH V

Abstract Classics Inspirational

5  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

మనసులో భావాలు

మనసులో భావాలు

1 min
574


హృదయకోశంలో దాగి ఉన్న ఒక్కొక్క మాటకి దొరకదు పదం,

భాష నిరంతరం అనిపించెను అగణిత శబ్దాల అగాధమైన హ్రదం |౧|


అక్షర అక్షరాల ఉపయుక్త సంయుక్తితో అయ్యెను సంవాదం,

మనిషి మనసులో సమస్త భావాలు అనుభవాలను చెయ్యలేం అనువాదం |౨|


అంతరంగ అభిమతాల అభివ్యక్తి వేళ అనివార్యం సముచిత స్వాదం,

అన్యథా నిస్సందేహంగా అవచ్చును విరక్తిజనక వివేకహీన వాద వివాదం |౩|


అందరి వద్ద వెల్లడించవద్దు ప్రతి ఒక్క రహస్యమైన భేదం మతభేదం,

ఎక్కడ ఎప్పడు ఎవరు కొంటె నారదుని వలె మారి పొందేదెను వినోదం |౪|


పరిచితులు అపరిచితులు వినిపెంచెను కర్ణ కఠోర కర్కశ అపవాదం,

అందరితోటి చెయ్యలేం సరిసమానమైన అర్థరహిత వ్యర్థ ప్రతివాదం |౫|


మనోరమ వచనాల వ్యాఖ్యానం వినటం ద్వారా పరిసరాల్లో తెద్దాం ఆహ్లాదం,

రమణీయ కమనీయ సాదర సంభాషణ మూలమున లభించెను గురుజనుల అనన్య ఆశీర్వాదం |౬|


అయ్యెను ఎప్పుడూ శ్రీలక్ష్మీనారాయణుల పావన పాదముల సందర్శనం,

అంతస్సులో ఆరంభం అయ్యెను పూజనీయ దేవతలకు భక్తికర నాద నినాదం |౭|


సంధ్యవేళ శ్రవణం అయ్యెను ఎప్పుడు దేవుని స్తుతి శంఖనాదం,

అవగతం అయ్యెను ఈనాటి క్షణాలు తిరుమలేశుని శ్రీజగన్నాథుని మహాప్రసాదం |౮|


Rate this content
Log in

Similar telugu poem from Abstract