విభేదాలు
విభేదాలు


సృష్టించలేదు దేవుడు జాతి, కుల, మత భేదాలు
చరాచర జగత్తులో ఏ ప్రాణిలోను కానరావు తేడాలు
సృష్టిలో మనిషికి మాత్రమే ప్రసాదించాడు కానుకలు
ఆలోచన, బుద్ధి, నవ్వు అనే అపురూపమైన వరాలు
బుద్ధిని ఉపయోగించి ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాడు
నవ్వుతూ అందరినీ తెలివిగా మాలిమి చేసుకున్నాడు
ఆలోచనతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించాడు
అందరికీ అన్నీ సమానమని చాటి, తానే అంతా దోచుకున్నాడు
జాతి, కులం, మతం అనే అడ్డుగోడలను లేపాడు
సృష్టిలో లేని విభేదాలకు తన స్వార్థానికై తెరలేపాడు
ఎక్కడాలేని జాతి వైరం అనే చిచ్చును ముట్టించాడు
ఆ దేవుని దృష్టిలో తనకు తానే ఎంతో దిగజారాడు
ప్రాణికోటి ఏ భేదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటుంది
మూగజీవి యైనా తన జాతిని కలుపుకుంటూ పోతుంది
మాటలు వచ్చిన మనిషే తన మాటలతో హింసించేది
వాటిని చూసి మనషి కొంతైనా నేర్చకౌనే అవసరముంది.