Venkata Rama Seshu Nandagiri

Abstract

5  

Venkata Rama Seshu Nandagiri

Abstract

అందాల జంట

అందాల జంట

1 min
355


పచ్చని పొలాలలో, పండిన పైరువలె,

నడిచి వస్తున్నది నవ్య , వన కన్య వలె.

ఆకుపచ్ఛ , పసుపుపచ్చల మేళవింపుతో,

బంగారు వన్నె ధాన్యపు రాశుల గలగలలతో,

మేని ఛాయకు పోటీ పడు వస్త్రధారణ తో,

సహజమైన చిరునగవులు చిందించే మోముతో.

ఆమె రాకకై నిరీక్షిస్తున్న నీలేష్ , అతి ఆతృతగా

వంతెనకీవల వైపున , సహనానికి మారుపేరుగా

ఆమె కన్పించినంతనే‌, ఆనందం ముప్పిరిగొనగా

చేయిసాచి ఆమె కరమంది, దాటించె సంతసంగా.

వస్త్రధారణ లో నవ్య పుడమిని తలపించెను,

నీలాంబరుడైన నీలేష్ ఆకసమును మరపించెను,

వారిరువురి కరచాలనమున క్షితిజరేఖ అగుపించెను,

ఆ కలయిక నయనానందకర దృశ్యమై అలరించెను.

విధాత చిత్రించె కుంచెతో రమణీయ ప్రకృతి వలె, 

తీరం దాటిన ఆ ప్రేమకు, కన్పట్టె నది ప్రకృతి కానుక వలె.


Rate this content
Log in

Similar telugu poem from Abstract