STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Comedy

4  

Venkata Rama Seshu Nandagiri

Comedy

ఆటకట్టు

ఆటకట్టు

1 min
316

చూస్తూ ఎదురింటిని అందుకున్నాడు పాట, తేజ

తెస్తూ భర్తకి కాఫీని, విన్నది ఆ పాటను అవనిజ

ప్రశ్నించింది సూటిగా తేజని 'ఎవరా చెలియా' అని అమాయకంగా చూస్తూ, అడిగాడు 'ఎవరని'

చెప్పాడు నమ్మకంగా 'తనకేమీ తెలియదని'

ఇంతలో వచ్చిందొక అమ్మాయి పిలుస్తూ అతనిని

అయ్యాడు తలక్రిందులు తేజా 'ఏమిటిదని'

అడిగిందామె 'నను మరిచావా, ఏమారుస్తున్నావా యని'

బేజారై చూశాడు తేజా, నిస్సహాయంగా భార్యని

చూస్తోంది కోపంతో అవనిజ ఎర్రగా అతనిని

వేసినా ఒట్టు మీద ఒట్టు ఆమె నమ్మలేదతనిని

ప్రాయశ్చిత్తంగా చెప్పింది, కోరింది కొనాలని

తప్పనిసరియై కొనిచ్చాడామెకు అడిగినవన్నీ

మెలుగుతున్నాడు నాటినుండీ జాగరూకతతో

మర్యాద, మన్ననలను తప్పక, అందరితో.

చూసాడు ఒకనాడు బజారులో ఆమెని భార్యతో

అనుసరించి వారిని వెనకే వెళ్ళాడు, మెలకువతో

ముచ్చటిస్తున్నారిద్దరూ కాలేజీ సంగతులు

అనందంతో విరబూసినవక్కడ నవ్వుల పువ్వులు

అతనిని చూసి 'ఇకనైనా మెలుగు జాగ్రత్తగా తేజ

మార్చడానికే నిను ఈ నాటకమాడింది అవనిజ

నా చదువుకు నాడు నీ వలన గండి పడిందిగా'

తప్పు తెలిసి క్షమించమని కోరాడు సిగ్గిలిన తేజ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar telugu poem from Comedy