విఘ్నాన్ని విసరవయ్య....వినాయక!
విఘ్నాన్ని విసరవయ్య....వినాయక!


గరళ కంఠుడి...
కోపాగ్నికి ఖండితమై..
తిరిగి త్రినేత్రుడు చేతే..
చెక్కబడ్డ
జగత్యేకైక...చిత్తరువా!
మాతృమూర్తి చే....
మలచబడ్డ మనసున్న...
మట్టి ముద్దవా!
ఒక్కసారి...
మా విన్నపాన్ని వినవయ్యా... ఓ వినాయకా!
ప్రతి పనికి విగ్నాన్ని...
విసరవయ్యా...విఘ్నేశ్వర...
అవును..
మానవాళిని..ఏమార్చే ప్రతి పనికి
విగ్నాన్ని విసురు...
మా ప్రాణాలతో చెలగాటమాడే వైద్యుల
ప్రతి ప్రాక్టీస్ కు విగ్నాన్ని విసురు...
మా విన్నపాలు వినని నాయకుల
ప్రతి ప్రోగ్రాం కి విగ్నాన్ని విసురు...
మమ్మల్ని కాపడేందుకు
కాసులాసించే పోలీసు ల
ప్రతి పైరవీలు కు విగ్నాన్ని విసురు..
మా నేల తల్లిని
అన్యాయంగా ఆక్రమించే
అసాముల ప్రతి పండగకి
విగ్నాన్ని విసురు...
మాధవీ లత ల మానాల ను
మకిలి చేసే మద పిచ్చోల్ల
ప్రతి పాడు పనికి విగ్నాన్ని విసురు....
విద్యను విలాస వస్తువు గా మారుస్తున్న
అత్యాశా పరుల ప్రతి ప్రోపర్టీ కి
విగ్నాన్ని విసురు...
ఓ విఘ్నేశ్వర....
వినమ్రుడునై..వేడుకుంటున్నా..
వీటన్నింటికీ ....
వాళ్ళందరికీ...
విగ్నాన్ని విసురు...
మాకు మాత్రం...
నీవే గణపతి వై...అధిపతి వై...
విజయాన్ని.... విసురు!
.......రాజ్......