Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Comedy

4.7  

Eevani Ravisankara Sarma

Comedy

నా చెలి పాదాలు !

నా చెలి పాదాలు !

1 min
385


రోజాలాంటి ఓ పడచు మావీధిలోంచి వెళ్తూ

నా దృష్టిని ఆకర్షించింది ఓ రోజు .

ఓరచూపులతో నా కోరమీసం ఎగిరేలా ఉంది

ఆ బాల హుషారైన ఊపు .

అది పల్నాటి పౌరుషానికి ప్రతీకైన గుంటూరు జిల్లా .

వయసు , సొగసుతో ఔరా అనిపించేలా ఆ షోకిల్లా .

కొంటెగా విసిరింది అంతలో ఓ చిరునవ్వు .

నా గుండెజారి గల్లంతై మౌనం రాజ్యమేలింది కాసేపు .

నా చెలితో పరిచయం అలా జరుగుతుందని

నేను ఊహించలేదెపుడూ .

ఆ తర్వాత మేమిద్దరం ఏకాంతంలో

చల్లని ప్రదేశాల్లో అప్పుడప్పుడు .

ఆమె పాదాల్లో తొణికిసలాడిన బెరుకుతనం

నన్ను మంత్రముగ్ధుణ్ణి చేయగా ..,

ఎర్రని పారాణి నాతో ఏడడుగులేసేలా చేసింది

ఒక అందమైన పందిరిలో ఆనందం వెల్లివిరియగా .

నాటినుంచి మువ్వల సవ్వడిలో ...

జడివానలోను , మాఊరి సంబరంలోనూ

నా అడుగుల్లో తను , తన అడుగుల్లో నేను .

నడిచినడిచి అలసినా , వేసవి వేడిమికి సొలసినా ...

కోపంతో అలిగినా , ముచ్చటలో మునిగినా ...

నా చెలియ పాదాలు సేదతీరుతూ నా అరిచేతుల్లో .

ఆనాటి అనుభూతులు కనుమరుమయ్యాక

ముద్దులొలికే బుగ్గలతో ... గాఢనిద్రలో ...


Rate this content
Log in

Similar telugu poem from Comedy