మదనా ! శశివదనా !
మదనా ! శశివదనా !


మదనా ! ఓ శశివదనా !
నా హృదయంలో చేరి సరాగాలే పాడేవా !
పగలు రేయి కళ్ళెదుటే కలలా ఊరించేవా !
ఏనాటి నా ప్రార్థనో మన్నించాడు .
నీలాంటి ప్రియుణ్ణిచ్చి దేవుడు కరుణించాడు .
నీ మాటలకు నా తల్లిదండ్రుల్లో సంతోషం .
మిత్రుల ముఖారవిందాల్లో పరమానందం .
నీ ఎత్తు ఆశ్చర్యంగా ఆరడుగులు .
ఆటలంటే ప్రాణమిచ్చేలా కరకుకండలు .
rong> శ్రావ్యమైన గాత్రమంటే మంచిమనసనే . కవిగా రమణీయతను ఆస్వాదించగలవనే . తలవగానే గులాబీతో కనిపించేవు . పరుగున వచ్చి ప్రశంసలు కురిపించేవు . నీ ప్రేమకు నాలో నిలువెల్లా పరవశం . కలసి నడవాలని నా ఊహాల్లో వసంతోత్సవం . రావా ! నను చేరుకోవా ! నేడే ప్రత్యక్షమై నా ముచ్చట తీర్చిపోవా ! *** # *** # ***