ప్రేమలో ..!
ప్రేమలో ..!


ప్రతి సహజ అనుభూతి అందరిలోలా నాలోనూ .
వెలుగుతో మనిషిలో జాగృతి .
స్పందించే హృదయంతో ప్రేమభావనలకు ఓ ఆకృతి .
ఎవరికివారే బ్రతికితే కాషాయ వస్త్రధారి .
కలసిమెలసి సాగితే ఆనందలోక విహారి .
ప్రియురాలి సాంగత్యంలో మధురమయ జీవనం .
ఆటపాటలతో జీవితమదేననిపించే పయనం .
పలుకులతో ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం .
అభిమానంతో ఒకరికొకరనే
స్నేహం వినూత్నం .
మనసులు కలిసి మరింత దగ్గరై
పెదవులపై నవ్వులపువ్వులు విరబూసే సమయం .
కళ్ళలోని కాంతులతో తొణికసలాడే ఆశల వినిమయం .
పల్లెలోనైనా , నగర జనసమూహ ప్రవాహంలోనైనా
ప్రేమపిలుపులో వర్ణనాతీతమైన ప్రత్యేకత .
చెరవాణిలో , కనిపించి మురిపించే అద్భుతలాలనలో
నా ప్రేయసితో కలకాలం నిలిచే ప్రేమఝరిలో
స్వప్నసుఖాల కలబోత , ఒకరికోసం మరొకరం విజేత .