STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

నువ్వు

నువ్వు

1 min
320


నువ్వు గగనంలో   

మెరిసే చక్కని చుక్కవి . 

నన్ను చీకటి రాత్రి   

అలరించే అమూల్యమైన బొమ్మవి .


నువ్వు ఆకాశంలో   

కనిపించే ఇంద్రధనస్సువి . 

నన్ను వానకురిసే సమయాన   

మురిపించే రంగుల గనివి .


నువ్వు ఉద్యానవనంలో   

విరబూసే అందమైన గులాబివి . 

నన్ను విహరించే వేళ    

మైమరపింపజేసే సుగంధానివి .


నువ్వు అవని కనుమల్లో   

బిరబిరా ప్రవహించే జీవనదివి . 

నన్ను పసిడిపండే నేలపై   

నవ్వులతో రంజింపజేసే జలకన్యవి .


నువ్వు ఇంటిముంగిట్లో   

వన్నెలు చిలికే రంగవల్లికవి . 

నన్ను ప్రతి శుభోదయాన   

   

కనులకింపుగా ముచ్చటగొలిపే సిరివి .



Rate this content
Log in

Similar telugu poem from Thriller