భరత మాత కౌగిలిలో....
భరత మాత కౌగిలిలో....


ఆ నాటి త్యాగధనుల మనోగతం..
కష్టాలు నావి కావా...
నా వాళ్ళకోసం భరిస్తా
కన్నీళ్లు నావి కావా...
నా వాళ్ళకోసం సహిస్తా
కండలు నావి కావా...
నా వాళ్ల కోసం కరిగిస్తా
లాఠీలు విరిగినవి నా వీపున కావా...
నా వాళ్ళకోసం ఆహ్వానిస్తా
సంకెళ్లు నాకు కావా...
నా వాళ్ళకోసం స్వీకరిస్తా
బానిసత్వం నాకు కాదా....
నా వాళ్ళకోసం అనుభవిస్తా
ప్రాణాలు నావి కావా...
నా వాళ్ళకోసం అర్పిస్తా
అని..
కడగళ్ళ వడగల్లను
తమ కౌగిలిలో దాచేసారు
మరి..
ఆ త్యాగధనుల ... ప్రాణార్పనలకు...
మనం అందించే నివాళి ఎలా ఉండాలి?
మన తోటి వారిని...
మన బోటి వారేనని
లేని వాడు ఎదిగినపుడే..
ఉన్న వాడికి బలమని
చాలా కొద్ది మంది దగ్గరే...
డబ్బు...కుప్పలు తెప్పలుగా
మూలుగు తోంటే...
అది దేశాభిృద్ధి ఎన్నటికీ...కాదని
సమానత్వం మే...
నిజమైన స్వేచ్చకీ...ప్రతిరూపం
అని ...తెలుసుకున్న నాడు
ముఖ్యంగా....వున్నవాళ్ళు...
ఉన్నతంగా...ఆలోచించి
అడుగులు వేసిన నాడు....
ఇండియా నిజంగా...
స్వతంత్రం దేశం అవుతుంది..
..... రాజ్......