పూల బతుకమ్మ
పూల బతుకమ్మ


పల్లవి :
ఆకేసి-ఒక్కేసి సందమామా - సిబ్బిపై ఒదిగేది సందమామా
గుమ్మడాకుపీటేసి సందమామా - గునుగు పూలమరేను సందమామా
చరణం :1:-
పూలన్నీ అమరేసీ సందమామా - దేవీనీ పెట్టీరీ సందమామా
బొడ్డెమ్మ ఆడీరీ సందమామా - పూజలూ సల్పిరీసందమామా
ఏరోజు కారోజూ సందమామా - బోనములిచ్చిరీ సందమామా
సద్దుల బతుకమ్మా సందమామా - నీటీలో విడిచీరీ సందమామా
|| అకేసీ ఒక్కేసీ సందమామా ||
చరణం : 2:-
సుఖంగా సాగినా జీవితానా - కరోనా వచ్చేను సందమామా
రక్షణ లేకనే సందమామా - లోకులూ గీట్టీరీ సందమామా
చేతూలూ కడుక్కోనీ సందమామా - మాస్కులూ ధరించీసందమామా
దూరంగా ఉండేటీ సందమామా - సంసార కళ్యాణం సందమామా
|| ఆకేసీ ఒక్కేసీ సందమామా ||
చరణం : 3:-
కీడుగల క్రిములను సందమామా - నశియింప జేసేయి సందమామా
ప్రకృతీ కొలిచేము సందమామా - రోగాలూ - కష్టాలూ సందమామా
రాకుండా చేసేయి సందమామా - మమ్మల్ని రక్షించు సందమామా
శక్తుల రప్పించీ సందమామా - సల్లంగా కాచూమూ సందమామా
|| అకేసీ ఒక్కేసీ సందమామా ||