తెలుగు కవన ప్రశస్తి ( గేయం )కవీశ్వర్ 23 .10. 2023
తెలుగు కవన ప్రశస్తి ( గేయం )కవీశ్వర్ 23 .10. 2023
తెలుగు కవన ప్రశస్తి ( గేయం )
రచన : కవీశ్వర్
తేదీ : 23 .10. 2023
పల్లవి : భరతమాత యందొదిగిన తెలుగు తల్లీ
వినీల కవితాకాశాన వెల్లివిరిసిన కల్పవల్లీ
నిత్య నవ్యత కల్గిన కవన సజీవ సిరిమల్లీ
గత వైభవ స్మరణ చేసుకునే వి జ్ఞానవెల్లీ
|| భరత మాత ||
చరణం 1 : పోతన , తిక్కన, నన్నయ కవితా రసఝరి
త్యాగరాయ అన్నమయ్య కీర్తనల శరవణ మాధురి
భువన విజయ కీలక కవ
ితా గోష్టి చర్చా సుమధురి
తెలుగు భాషకు కల్గిన ఉన్నత సోపానఅధిరోహణ సిరి
|| భరత మాత ||
చరణం2 : సెలయేరులా,సుమధుర వాహినీ గీత రచయితల కృషి
వాటికి సుస్వరాలనద్దిన కర్ణపేయ సంగీత రచనల నృషి
గాత్రాన్నందించిన నేపథ్య గాయని గాయకుల అవిరళ కృషి
శ్రోతల మనోల్లాస స్వరఝరి తన మన సంగీత భావనా రిషి
|| భరత మాత ||