Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

jayanth kaweeshwar

Tragedy Action Inspirational


4.5  

jayanth kaweeshwar

Tragedy Action Inspirational


పొగాకును వర్జించు - వచన కవిత

పొగాకును వర్జించు - వచన కవిత

2 mins 257 2 mins 257

పొగాకును వర్జించు - వచన కవిత : కవీశ్వర్ 01.06.2021

పుట్టిన శిశువు జీవించును అందమైన జీవితం 

సుగుణాలతో పాఠశాలలో గడుపును విద్యకోసం 

ఎక్కువగా మంచి అలవాట్లతో చదువు పూర్ణం 

తల్లిదండ్రులు గురువులు , హర్షించును సమాజం


కొంతమందిా సహచరుల దుర అలవాట్ల అగుచుండు ప్రభావం 

ప్రభావం తో తమ జీవితాన్ని,అంతమొందించు గా అతి క్రమం 

చతుర్ముఖ పారాయణాలు (సిట్టింగ్స్ ) కుటుంబాలను చేయు నాశనం 

ఆరోగ్యం , జీవితం , పరుల కు కల్గించు విరక్తిని బయట పడలేక ఉండడం 

ప్రబోధాత్మక (వచన ) గీతం


పల్లవి : వద్దురా చిన్నీ – శిథిలమై పోవద్దురా కన్నా

తంబాకు ను నమలద్దు , గుట్కా తినొద్దు – ఊయోద్దు రా !౟

వితం కావోద్దే అంధకార బంధురం , నోట్లో పుండ్లను పెంచొద్దురా


                                     // వద్దురా చిన్నీ //


చరణం 1 : ధూమపానం తో నీకే కాక – ఇతరుల ఆరోగ్యం క్షీణించేనురా !


మాదక ద్రవ్యాల తో శరీరాన్ని – తూట్లు పోడుచుకొంటూ శిథిల మౌతావేరా?


నీకంటూ లేవా ఆశలూ-ఆశయాలూ – జీవన ధేయం కనరాదా ?


మీరు బాధ పడి – మీవాళ్ళను బాధపెట్టి – ఏమి సాధిస్తారు? ఏమి సాధించేరు ?


                                           // వద్దురా చిన్నీ //


చరణం 2 : ఊపిరి తిత్తుల కేన్సర్ వచ్చేను – ధూమ పానం వల్ల


హుక్కా ఒక గుక్కా నీకు మజానంటా , నడిపేవారు నిన్ను దోచుకుంటారంటా


మీ ఉసురు తీస్తుంది – శ్వాస నిలువదురా మీకు – దీనితో తంటాఅంటా


పెద్దల మాటలు చద్దుల మూటలు రా – ఇవి అన్నీ మీ మంచికే నంటా రా


                                          // వద్దురా చిన్నీ //


చరణం 3 : కడుపులో మంట , గొంతులో తంటా , నీ మెదడు నీ సోయి లో లేదంటా


మద్యపానం చేయడం నీకు సరదా నంటా , ఎదుటివారి జీవి హరీ అంటా


రక్తం కలుషితమంటా , నీ శరీరం నీకే తెలియక దొ(డో)ల్లునంటా


వాహనములను అట్లనే నడుపుతావంటా , నీ తల్లి దండ్రులకు జైలంటా


                                      // వద్దురా చిన్నీ //


చరణం 4 : ఎందుకో మనసు లాగుతుందంటావు , పెద్దలను కష్ట పెడుతుంటావు


వద్దంటే విననంటావు , ఏవో నేరాలు చేస్తానంటావు


మాను మంటే మాననంటావు, అదే కదా ణా సరదా అంటావు


మంచిగా ఉండమంటే , ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు


                                  //వద్దు రా చిన్నీ //


చరణం 5 : ధనాన్ని ,సమయాన్ని , అభివృద్ధిని పణంగా పెట్టొద్దు బాబూ


మంచి చెప్పే మిత్రులను , పెద్దలను దూరం పెట్టొద్దు రా కన్నా !


దురాలోచనలతో మంచి పనులకు విఘాతం కలిగించొద్దురా చిన్నా !


గాంధీ జీ – మూడు సూత్రాలతో పాటు నాల్గవ సూత్రాన్ని విడువద్దురా బాబూ !



                                            //వద్దురా చిన్నీ //


ముగింపు : “ చెడు కనవద్దు , చెడు అనవద్దు , చెడు వినవద్దు మరియు చెడు

చేయవద్దు ఇది బాపూజీ పిలుపు , అదే మేలుకొలుపు”

వ్యసనాల బారిన పడే , పడిన , పడబోతున్న యువతకు , పెడత్రోవన

ఎగదోసే దుర్మార్గుల నుండి ఆమడ దూరం గా ఉండండి , తస్మాత్ జాగ్రత్త !


ఈ ప్రబోధాత్మక వచన గీతాన్ని చదివి , పాడి , ఆచరించి , సన్మార్గంలో

పయనించి యువతరానికి మార్గ దర్శకులు గా మారండి . మొన్నటి తరం, నిన్నటి

తరం, నేటి తరం , రేపటి తరం తర తరాల కు సరిపడా మొదటి అడుగు వేసి , మార్గ

దర్శకులు గా మారండి . అదృష్ట వంతులు, ఆదర్శ వంతులు , ఆరోగ్య వంతులు గా

మారే యువతకు ఆశీస్సులు , అభివాదములు .

కవీశ్వర్.


హామీ – పత్రం

ఈ నా రచన లన్నీ నా స్వంతమే ఎక్కడా ప్రచురింప బడలేదు . ఇవి అన్నిటి నీ

ఎక్కడా ప్రచురణ నిమిత్తం పంపించ లేదు. ఇవి అన్నీ నా ఆలోచనా తరంగాల నుండి

ప్రభవించినవి. ఇవి దేనికి అనుసరణ కానీ, అనుకరణ కానీ కాదు . sweeya

kavithalu . ఇవి నా స్వంత రచనలు.

కే. జయంత్ కుమార్ bvbv nird campus RAJENDRA NAGAR HYDERABAD.


 



Rate this content
Log in

More telugu poem from jayanth kaweeshwar

Similar telugu poem from Tragedy