ఎండమావి
ఎండమావి


నీ స్నేహం మండు వేసవిలో పండు వెన్నెల
శిశిరంలో హేమంతం
హేమంతంలో మధుర జ్ఞాపకం
మధురజ్ఞాపకంలోని మాధుర్యాన్ని తలుస్తూనే
వేయికళ్లతో ఎదురు చూసాను
తిరిగి వచ్చిన నిన్ను చూసి దిమ్మర పోయాను
ఆప్త మిత్రుని ఆత్మీయత నే చవి చూసిన నేను
అతనిలో మార్ధవాన్ని ఊహించిన నేను
అపరిచిత ప్రవర్తనకు నాలో నేను అవాక్కయ్యాను
మనోగ్రందులన్నీ అశ్రువులు స్రవించాయి
అన్నింటా ప్రధమ అవకాశాన్ని పుచ్చుకున్న నన్ను
స్నేహంలో అధమ స్థానానికి పంపించిన
నీ ఔదార్యతకు అలిసిన
హృదయం కన్నీటి సాగరమయ్యింది!!