కరోనాను ఖతం చేద్దాం రండి
కరోనాను ఖతం చేద్దాం రండి


*******************
అందరూ ఐకమత్యంగా దృఢ సంకల్పం తో
భౌతికంగా ఎవరికీ వారే విడి విడిగా విడిపోయి
ఎవరికీ కనపడని రక్కసి పై
గత్తర కన్నా మిన్నగా అందరినీ పొట్టన పెట్టుకుని
మహా ప్రళయాన్ని సృష్టిస్తున్న మహమ్మారి మీద
అందరోక్కటై ప్రపంచ యుద్ధం కన్నా మిన్నగా
ఫేస్ మాస్క్ లు గ్లౌజులే కత్తి కవచాలుగా
ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖ గీసుకుని
ఎవరింటిలో వారే ఉండి నిరంతరం అప్రమత్తమై
పాలకుల సూచనలను ,హితవులను పాటిస్తూ
చేతులను సబ్బుతో పరి శుబ్రంగా కడుక్కుంటూ
ముఖాన్ని పదే పదే చేతులతో తాకకుండా
సానిటైజర్లు వాడుతూ పెద్దవాళ్ళ మాట పాటిస్తూ
వాట్సప్ లో ఫోన్లలో ఎవరెవరితోనో మాట్లాడుతూ
కుటుంబ సభ్యులతో మాట్లాడాలను కున్న ఎన్నో మాటలను
ఎన్నో ఏళ్ల తర్వాత కరువుతీరా కడుపారా
మనస్సు ఆహ్లాదం పొందేట్లు తనివితీరా మాట్లాడుతూ
కలో గంజో ఇంట్లో ఉన్నదానితో సరి పెట్టుకుని
ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడడానికి
ముందు వరసలో నిలబడి సేవ చేస్తూన్న
భువి పైని దేవతలైన వైద్యులు , సిస్టర్లు, పారామెడికల్ సిబ్బంది
పోలీసులు, కోరియర్లు, వాలంటీర్లు అందరికీ
శత సహస్ర కోటి వందనాలు చేస్తూ
జనతా కర్ఫ్యూ విజయవంతం చేసినట్లు
మూడువారాల ఈ లాక్ డౌన్ కూడా విజయవంతం చేసి
అందరం కలుసుకోక పోయినా విడి విడిగానే ఉన్నా
మనో బలంతో కలిసి కరోనా పీక కోసి ఖతం చేద్దాం రండి.
*************************