ఎర్రసైన్యం (prompt 27)
ఎర్రసైన్యం (prompt 27)

1 min

34.4K
పోరాడుదాం, పోరాడుదాం, అందరం కలిసి పోరాడుదాం
కరోనా మహమ్మారిని జడిసి వెనక్కు పోయేలా పోరాడుదాం.
మేఘనాధునిలా మాయా యుద్ధం చేసినా మట్టి కరిపిద్దాం
మనందరం ఏకమై ఎర్రసైన్యంలా దాని మాయను ఛేదిద్దాం.
మాయను పన్ని హరించాలనుకుంటోంది అది మన ప్రాణాలు
కానీ వైద్యులు, వారి సహాయక దళాలు, వారే మన సైనికులు.
వారు ప్రజలకు రక్షకులే కాదు, దానిని మట్టుపెట్టే ఎర్రసైన్యం
దాని అంతు చూడ్డానికే అహోరాత్రులు వెచ్చిస్తున్నారు సమయం
తప్పకుండా మనమంతా ఈ పోరాటం లో నెగ్గి తీరుతాం
కరోనా మహమ్మారిని దేశం నుండి వెళ్ళగొట్టి తీరుతాం.