సోదరి సోదరుల బంధం
సోదరి సోదరుల బంధం
అమ్మ తరువాత ప్రేమను పంచుతుంది
అన్న కళ్ళలో నీళ్ళు చూస్తె
చెల్లెలు గుండె చెమ్మగిల్లుతుంది
తమ్ముడి గొంతులో బాధ వింటే
అక్క మనసు చివుక్కు మంటుంది
పేగు బంధంతో పెనవేసుకున్న అనుబంధం
కలిసి పెరిగిన సంబరంలోని సంబంధం
ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా
సోదరుడు సంతోషంగా ఉండాలన్నా
నీ కష్టంలో రక్షనై ఉంటానన్నా
తన తోబుట్టువు ఎక్కడున్నా
ఆనందాల పందిరిలో చల్లగా ఉండాలన్నా
సోదరి సోదరుల సంబంధాలుకున్నా
ఒకరికి ఒకరం ఉన్నామంటున్నా
అన్నకు చెల్లె
లు రక్ష చెల్లికి అన్న ఇచ్చే బాసట
సోదర ప్రేమలో ఉండే గాంభీర్యం
సోదరి ప్రేమలో ఉండే లాలిత్యం
సోదరునికి సోదరి పట్ల
ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుంది
సోదరికి సోదరుని పట్ల
ఉన్న ప్రేమను ఎలా కాపాడుకోవాలో చెబుతుంది
కదిలిపోతున్న కాలంలోను
తరిగిపోతున్న అనుబంధాలను
వయసుతో పాటు పెరుగుతున్న బాధ్యతలతోను
వచ్చిన సంబంధ బాంధవ్యాల అంతరాలను
పక్కకు నెట్టి సోదర బంధంలోని మాధుర్యాలను
తోబుట్టువును చివరి క్షణం వరకూ ప్రేమించమని సోదరుని క్షేమం కోసం నిత్యం ఆకాంక్షించమనీ