STORYMIRROR

Nannam Lokesh

Romance

4  

Nannam Lokesh

Romance

కలుసుకోవాలనె తాపత్రయము

కలుసుకోవాలనె తాపత్రయము

1 min
308


మనసుకు నచ్చిన వారు

మనసును గెలిచిన వారు

మనతో లేకపోతే కలిగె వ్యధ

మమతకు ప్రతిరూపము

ప్రేమకు ప్రీతికరము

లేకుండా ఉంటే కలిగె భాధ


రుచులతో చెప్పలేని 

రంగులతో వర్ణించలేని

అందాల తార కన్నా ఎక్కువె

చూసే కన్నులతో 

వినే చెవులతో 

చెప్పిన తీరని లోటు తక్కువె


మాటలతో మైమరిపించావు

చూపులతో లాగేసుకున్నావు

మనసనే నదికి పారె నీళ్లుగా ఉండన

హృదయపులోని కోరికలు

కన్నులతో చూసే భావాలు

విహరించే పక్షికు రెక్కలై ఉండన


మనసుతో గాయం చేసావె

ప్రేమతో ఊపిరి పోసావె

చూపుకు అందం తెచ్చావె

చెవులకు సంగీతం పాడావె

పీల్చే శ్వాసతో స్వర్గం తెచ్చావె

హృదయంకు ఆయువు పోసావె


నిన్ను విడచి నా మది ఉండ లేదు

నిన్ను చూడని నా కళ్ళు చూడ లేవు

నీ రాక వినని నా చెవులు విన లేదు

మనసును అల్లకల్లోలం చేసావు

మమతను మరుగైపోయ్యేలా చేశావు

ప్రేమను అందకుండా దూరం చేశావు


ఎన్ని తలచిన నువ్వు లేని క్షణము

ఎన్ని చెప్పిన తీరని కష్టము

ఏమి చూసిన చూడని అందము

ఏమి వినిన రాని రాగము

నువ్వు లేని హృదయము

కలుసుకోవాలనే తాపత్రయము



Rate this content
Log in

Similar telugu poem from Romance