లవ్ ఫీలింగ్ ...
లవ్ ఫీలింగ్ ...


తప్పు ఒప్పుల మధ్య తేడా తెలియలేదు....
నీ ఊసు ఎవరైనా అనుకునే వరకు
జనన మరణాల మధ్య గమ్యం తెలియలేదు...
నీతో కలిసి నడిచే వరకు
సుఖదుఃఖాల మధ్య అర్ధం తెలియలేదు...
నీతో చెలిమి చేసే వరకు
దూరం దగ్గర మధ్య ఉన్న భేదం తెలియలేదు...
నీ అలికిడితో ఎద అలై పొంగే వరకు
కాలం తో కలిసి కరిగి పోవడం నా ప్రేమకు తెలియలేదు...
నిన్నే తలచే మది మానై పోయేవరకు
నీ పెదవిపైన చిరునవ్వుగా మారాలనుకున్న
నీవు నిదురపోతే కొంటె కలనై కలవాలనుకున్న
నువ్వు ఎదురైన ఆ క్షణం శిలనై నిలుచున్న
నీ రాక కోసం వాకిలిలో ముగ్గునై ఎదురుచూస్తున్న
నువ్వు కడలివైతే అలజడిరేపే అలనై చేరాలనుకున్న
నిన్ను చేరుకోవాలని చిరుగాలినై తరుముతున్న
నిన్ను చూడని రోజు సంద్రమై పొంగుతున్న
కొమ్మ ల మాటున కోయిలవై నువ్వు రాగం తీస్తున్న
వసంతమై నీ తోడుగా రావాలనుకున్న
కలత పడుతూ ఉం టే కన్నీరుగా మారి కరిగించాలనుకున్న ...
పాపిట నిలిచే సింధూరం లా నిన్ను నిలుపుకుందామనుకున్న
నేను వేసే ప్రతీ అడుగు నిన్ను చూపిస్తున్న
పలికే ప్రతీ పలుకులో నీ పేరు వినిపిస్తున్న
మాట రాని మౌనం ఆ భావం చూపలేకున్నా
ఎద మాటున దాగిన మాట తెలుపలేకున్నా
కం టిపాప చాటున నీ రూపం దాచలేకున్నా
ప్రతి రోజూ ఓ రోజానై నీ కోసం పూస్తున్న
కోటి రాగాల వీణనై నిన్ను పిలుస్తున్న
నీవు ప్రశ్నవైతే జవాబునై నిలవాలనుకున్న
నేను రాసే ఈ కవితకు అం తం లేకున్నా
నా మదిలోని నిరీక్షణ నువ్వు కనుగొనలేకున్నా
నీకు చూపలేని నా ఈ ప్రేమకు అంతం మరణమే అనుకున్న ...
పలుకలేను కోటి రాగాల వీణలా
ఎదురుచూడలేను వేచి ఉం డే రాధలా
అడిగి అడిగి సాధించలేను సత్య లా
తెలుసుకోమని ఎగసి పడలేను కెరటం లా
మౌనం తోనే సాగేను నా జీవితం ఎన్నాళ్లయినా అలా