Ramesh Babu Kommineni

Romance

4.6  

Ramesh Babu Kommineni

Romance

వింత కోరిక

వింత కోరిక

1 min
962


ప౹౹

వింత వింత కోరికలే విరిసినే ఎదలో

చెంత చేరి ఊరించినే అది మొదలే ౹2౹


చ౹౹

ఘనమైన ప్రేమికు‌లకు నవ మాసం

అనువైన సమయానికై వేచే హాసం ౹2౹

ఈ మాసమే ఉన్నదీ ప్రేమల కోసం

నీ కోసమేగ చేస్తున్నాగా వనవాసం ౹ప౹


చ౹౹

అందివచ్చే అదనుకే పదునెక్కువ

చెందిచేరదీసే ప్రేమకే ఏమితక్కువ ౹2౹

కారణమే ఎందుకే ప్రేమించేందుకు

తోరణమల్లే నీవు అల్లుకునేందుకు ౹ప౹


చ౹౹

వాలంటైన్ డేస్ మరి నీకే ఎందుకు

వరుస కలిపేసి అలా వలిచేందుకు ౹2౹

ప్రేమన్నది ప్రతీరోజు నూతనమేగా

విరామమన్నది లేని శాశ్వతమేగా ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance