జలకమాడి..
జలకమాడి..
జలకమాడి సొగసులో జాలువారే వయసులో
తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో
గానమే ధ్యానమై పవనమై కవనమై పలకగా
ఘనమే భావమే అనుభవమై ఏకమై ఒలకగా
మదిలో ఊసులూ మల్లెల గుసగుసలై పొరలే
పొదిలో బాణంలా పొంగిన సొగసులూ తరలే
తీరేనా దాహం తీయని చెలియ పలుకలతోనే
మారేనా మోహం మరులు చేసే అలుకలతోనే
కలసివచ్చే కాలంలో కాముడు ఆశీర్వదించినే
తెలిసివచ్చే తరుణంలో తేనెలూ ప్రసాదించినే
జలకమాడి సొగసులో జాలువారే వయసులో
తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో
గానమే ధ్యానమై పవనమై కవనమై పలకగా
ఘనమే భావమే అనుభవమై ఏకమై ఒలకగా
కొరతలేని కోరికే చిరుతలా కబళించిపోయినే<
/p>
గురుతురాని వలపు గూఢమై ఉండిపోయినే
సరసమే విరసమైపోకుండనే సవరించనేలేవ
పరుసవేది వరస మార్పులే నిలవరించనేలేవ
ఎలమి నిండిన ఎడదనే నీవూ కదిలించలేవు
కలిమి పండిన స్నేహంలో కఠినం చూడలేవు
జలకమాడి సొగసులో జాలువారే వయసులో
తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో
చిలుక కొలికి చిరు మందహాసం చిన్మయము
తళుకు మొలక తనువంతనూ తన్మయము
చిలుక కొలికి చిరు మందహాసం చిన్మయము
తళుకు మొలక తనువంతనూ తన్మయము
జలకమాడి సొగసులో జాలువారే వయసులో
తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో
గానమే ధ్యానమై పవనమై కవనమై పలకగా
ఘనమే భావమే అనుభవమై ఏకమై ఒలకగా