పాడకే కోయిల...
పాడకే కోయిల...


పాడకే కోయిలా పరువాలూ పురివిప్పునే
ఆడకే యిలా నయనాలేమో గురితప్పునే
వదలక వలపన్నది వెంటాడి వేధించునూ
మెదలక ఉండలేని మనసు సాధించునూ
హద్దులేని ఆలోచనలేమో ఆగవుగా మరి
సద్దుచేయక సరసాలూ సాగించును కోరి
పాడకే కోయిలా పరువాలూ పురివిప్పునే
ఆడకే యిలా నయనాలేమో గురితప్పునే
ఎక్కడిదో మరి నిను వరించినే ఈ అందం
చిక్కడదా మనసులోనే ఆ గాలిలో గంధం
సడి వడిలో నడవడి తప్పునే తమకంతో
పొడి పొడి పలుకులే గానమౌ గమకంతో
పాడకే కోయిలా పరువాలూ పురివిప్పునే
ఆడకే యిలా నయనాలేమో గురితప్పునే
మంచు పొర కరిగితే అలా నీరవుతుంది
అంచు చీర కడితే ఒక అందమవుతుంది
మౌనమే మనసే విప్పిన రాగమవుతుంది
గానమే గమనమై మదినే చేరువవుతుంది
పాడకే కోయిలా పరువాలూ పురివిప్పునే
ఆడకే యిలా నయనాలేమో గురితప్పునే
పాడకే కోయిలా పరువాలూ పురివిప్పునే
ఆడకే యిలా నయనాలేమో గురితప్పునే