STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5.0  

Ramesh Babu Kommineni

Romance

కురిసిపోవా

కురిసిపోవా

1 min
633


ప౹౹


మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను


దేహమా తడిసిపోవా తన్మయించను ౹2౹


చ౹౹


ఎదురుచూపులేనా ప్రతి ఋతువులో 


చెదిరినా ఆశలేనా చేరి ఆ బ్రతుకులో ౹2౹


పూలు పురి విప్పినే చల్లనీ నీ రాకతో


రాలు ఆకులు రవళించును చేరికతో ౹ప౹



చ౹౹


ఎండమావులకే ఎడతెగని తాపము


పండగెరుగని ఎదనే విరహతాపము ౹2౹


దప్పిక తీరక దరహాసం తొలగిపోవు


తప్పక తరలకున్న జీవం తరగిపోవు ౹ప౹



చ౹౹


తరుణమేకోరి తన్మయమే పెంచును 


ఏ రుణమేలేక ఎదనే పరితపించును ౹2౹


మేఘమా కురిసిపోవా ఖుషీచేయను


రాగమా కలసిరావా కల సరిచేయను ౹ప


Rate this content
Log in

Similar telugu poem from Romance