The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ramesh Babu Kommineni

Romance

5.0  

Ramesh Babu Kommineni

Romance

నిన్నటి కలలు

నిన్నటి కలలు

1 min
54


ప౹౹

నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను

సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను ౹2౹


చ౹౹

పన్నీరే చిలకాలని పదికాలాలే ఆశగా చూడ 

కన్నీరే మిగిలిందా అన్ని కాలాలే ఎదనే వేడ ౹2౹

చిన్ననాటి ఊహలే చిగురించాలని కోరికేగా

ఉన్నపాటీ ఊసులే ఊరించాలని ఊరికేగా ౹ప౹


చ౹౹

తనువెంత తహతహలాడిందో మనసెరుగు 

అణువంత అహమే చేసినది ఆ వరసెరుగు ౹2౹

ప్రేమంటే ఆడుకోనూ ఆటేకాదని తెలుసుకో

పొమ్మంటే పోయేది లేదని ఎరిగి మసులుకో ౹ప౹


చ౹౹

బేరాలకు బ్రేకప్లకు ఇక కాలం కలిసి రాదులే 

వరాలకు వరసలే కుదిరి ఏదోజరిగి పోదులే ౹2౹

సహజమైన ప్రేమలో సమానత్వం కావాలిలే

బేషజమైన బేషరతులే లేక కలిసి పోవాలిలే ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance