చైత్ర వసంతం
చైత్ర వసంతం

1 min

34.9K
ఉష్ణం కురిసిన
ఆకాశం
రాత్రికోసం
శీతల గంధాలు పూసింది
మూలన పెట్టిన
శీతల యంత్రం
దుమ్ము దులుపుకుని
పవన సేవకు
సిద్ధమైంది
మావిచిగురు లతో
సవరించిన గొంతు
కచేరీకి కదిలింది
కొమ్మల్లో
ఆ రాగాలాపన విన్న
ప్రకృతి
పరవశించింది
చైత్రం తీసుకొచ్చిన
వసంతానికి
వెన్నెల సాయంత్రాలు
మల్లెల గంధాలు పూసుకొని
ఎదురు చూస్తున్నాయి
రంగు రంగులుగా
ముస్తాబైన
ప్రకృతి కాంత
శిశిరానికి సెలవంటూ
చైత్రానికి స్వాగతం అంటోంది