చిద్విలాసం
చిద్విలాసం


ఎప్పటినుంచో చూస్తున్నాను
నేను పొగిలి పొగిలి ఏడుస్తున్నా
పొరలి పొరలి నవ్వుతున్నా
తన ముఖంలో అదే లాస్యం
నాతో ఎన్ని ఆటలాడినా
ఆ విధివిలాసం
తనలో అదే చిద్విలాసం
అసలాట తనకు తప్ప
ఎవరికీ తెలియని రహస్యం
పొంగిపోతున్నా
కుంగిపోతున్నా
ముందున్న మలుపెరిగిన స్వామికి
నాతో ఆట పరిహాసం