అర్థరాత్రి
అర్థరాత్రి


ప౹౹
మృగాలూ సంచరించే అడవి ఇది తల్లి
యుగాలూ మారినా ఆరని నెగడు చెల్లి ౹2౹
చ౹౹
అర్ధరాత్రి ఆడది తిరగాలన్నారే పెద్దలు
నేరగాళ్ళు ఏలికలై చెబుతారే సుద్దులు ౹2౹
ఇంగితం లేని క్రూరులే ఈమధాంధులు
సంగతి తెలియని మీరే కొత్త సమిధలు ౹ప౹
చ౹౹
కనిపెంచిన వారికి కనిపించక పోయినా
వినిపించే ఆ వాణి వినిపించకపోయినా ౹2౹
తల్లడిల్లరా వాత్సల్యంతో తల్లీతండ్రులు
ఎల్లకాలం కుంగిపోవా వారి నవనాడులు౹ప౹
చ౹
విలువైన జీవితం ఇంతలోనే తెలవారు
కర్కోటకులు నిరూపించగా పలుమారు ౹2౹
మొద్దు నిద్ర మానదే మన యంత్రాంగం
సద్దులేక చూపు విరుగుడు మంత్రాంగం౹ప౹
చ౹౹
అర్థరాత్రి సంచారం అసలే మరచిపో తల్లి
అర్థచీకటి పడకమునుపే ఇల్లేచేరుకో చెల్లి౹2౹
అవసరమైన ఆయుధాలే దగ్గరే ఉంచుకో
ఆపదలో వెంటనే సమాచారమే పంచుకో ౹ప౹
చ౹౹
అడవి మృగాలను అదనులోనే గుర్తించు
నిడిఎక్కువైనా రాదారిలో నడక సాగించు ౹2౹
ఆ భయంతో ఎలా బ్రతకాలని నా భయం
నయంతో చట్టాలు స్త్రీ కిచ్చునా అభయం ౹ప౹