STORYMIRROR

Keerthi purnima

Drama Classics Fantasy

5  

Keerthi purnima

Drama Classics Fantasy

మా అయ్యా

మా అయ్యా

1 min
49

ఎంతటి గనుడో మా అయ్యా...

ఎంతటి త్యాగదనుడో మా అయ్యా...


కొడికంటే ముందు లేసి కునుకు 

లేకుండా కట్టపడుతాడు మా అయ్యా...


కాయ కట్టం జేసి కనులు సెమ్మగిల్లిన

కూసింత అయిన కానరానియ్యడు మా అయ్యా..


మనసున మేమంటే కొండంత పేమ ఉన్న 

బైటికి మాత్రం కోపంగా ఉంటాడు మా అయ్యా...


సక్కగా సదువుకోరా సంటోడా అని 

సంచిల రూపాయి బిల్ల పెడతాడు మా అయ్యా...


ఎన్ని కోట్లు సంపాదించిన 

నెల తల్లిని మర్వద్దు అంటాడు మా అయ్యా...


అగాధంల కురుకపోయీ ఉన్న నాకు కట్టమత్తే 

ఆగమేఘాల మీద అత్తాడు మా అయ్యా...


ఇలాంటి అయ్యా లేడే అని

కుమిలిపోతాడేమో ఆ శివయ్య...


అలాంటి అయ్యా మనకున్నాడు గదయ్య...

కట్టమచ్చిన యేల కాదంటే ఎట్టాగయ్య...


రేపటి కాలానా నువ్వు అయ్య గాక తప్పదయ్య...

నీ కొడుకు నీలానే చెత్తాడు కదయ్యా ...


భావితరానికి బాధ్యత నెర్పే భాధ్యత నీదే నయ్య. 

నువ్వు మారకుంటే నష్టం నీతోనే మొదలయ్యా....


గనుడు నువ్వేనే నా అయ్యా ..

త్యాగదనుడివి నువ్వేనే నా అయ్యా...


Rate this content
Log in

Similar telugu poem from Drama