STORYMIRROR

Keerthi purnima

Classics Inspirational Others

4  

Keerthi purnima

Classics Inspirational Others

నిశాచరి

నిశాచరి

1 min
269


నిషా చరి

మత్తుకి బానిసై సుఖమని భావించి

సుఖం అంటే తేలిక గెంతులేసే మర్కటమా

మసక బారిన బారుల్లో ఉరి చివరీ దారుల్లో

జీవితమనేది ఒకటుందని గుర్తు రాదే?

కనీ పెంచిన కన్న వారు గుర్తు రారే?

కారణం ఎవరని ప్రశ్నిస్తే

ఏమని చెప్పను ఎవరని చూపను

రుచి చూపి వదిలే సమజమా?

హితాన్ని కోరే స్నేహం అంతరించడమా?

సమయమే దొరకని నేటి

కుటుంబ వ్యవస్థ జీవనమా?

లేని అలవాట్లను సృష్టిస్తున్న

అంతర్జాల మార్జలమా?

మత్తు ముసుగులో మునిగిపోయి

మనిషివని మరిచిపోయి..

బంధుత్వం మరిచి పోయి

చెల్లి నీ చేరిపితివి

కన్న వారి ఊపిరాపితివి

స్నేహాన్ని సమాధి చేసితివి

మంచి చెడులు మరిచి

మత్తనే మాయ లో మునిగితివి

నువ్వు సాధించిందేమిటి?

చివరికి మిగిలేదేమిటి?

నువ్వు పట్టుక పోయేదేమేటి?

ఆలోచించు ఒక్క క్షణం!!మార్చుకో నీ లక్షణం

ఇకనైనా తక్షణం!! నిర్మించు నీ కర్తవ్యం

మత్తు వదిలి ఎగరవేయి

నీ జీవిత విజయా పతాకం.

మత్తు వదిలి మనసుకి పలుకు స్వాగతం!!


Rate this content
Log in

Similar telugu poem from Classics