శివ హర శంకర ఓ ఈశ్వర
శివ హర శంకర ఓ ఈశ్వర


పులి చర్మమే చీని చీనాంబరమా
విషం కక్కే పామే కంఠా భరణమా
స్మశానమే నివసించే స్థలమా
దరి చేరనియననా నిశ్చయం
అందని ఎత్తులలో ఉందట నీ ఆలయం
అడుగడుగునా ఎదురవ్తుందట అపాయం
ఇంతా ఓర్చి చేరితే లేదట నీ పూర్తి రూపం
కానివనంటావా నీ సాక్షాత్కారం
నీకెంతో ప్రియమట రుద్రాభిషేకం
కొలువై ఉంటావట చేస్తే యాగం
ఇచ్చేది మాత్రం బస్మం
ఇంతేనా భక్తుడికి మిగిలే ఫలితం
అని ప్రశ్నిస్తే నాకు తెలిసిందిలే
భోళా శంకరుడివి అని తెలియకూడదనే ఆ రౌద్రపు ఆహార్యం
మట్టితోనైనా చేసి పూజించే అవకాశం కోసమె ఆ లింగ రూపం
మాటకే అభిషేకం భక్తితో పచ్చి మాంసమైన పరమాన్నం
ఇంకా ఏమి కావాలి కారణం శివ నామమే శిరోధార్యం