సుందరకాండ
సుందరకాండ
తండ్రి మాటకు
ముగ్గురు తల్లుల ప్రేమలు విడిచి
భారతనికి మకుటం లేని మహరాజు
రాచరికం త్రునమని
నార బట్టల కట్టీ
అడవి బాట పట్టిన
ఆ రోజు చెరగలేదు
ఆ మహ మనిషి
మ్రుదు మందహసం
బంతులటాల్లొ అడ్డం
వచ్చిన శివుని విల్లు
ఎడమచేత పక్కకి నెట్టిన
ఆ చిన్నరి మా తల్లి
నార చీరలు కట్టి
భర్త వెంట
కాలి నడకన అడువుల
పాలు పట్టిన నాడు
చెమ్మగిలలేదు ఆ కన్ను
ఆ మర్కటానికి
ఎమిటి పరిక్ష
కౌగిలిలొ కరుణ చూపిన
స్వామి మనసు కలచి వేస్తున్న
వేదన ఎల మాపలి అని
చేత పట్టిన ఉంగరాని
అడిగితే మాత్రం తెలిసేనా
సముద్రం పై లంగిచి
అమ్మ చిరునామ తెలుసుకున్నాక
చేతికి అందిన చూడమని
ఆ తండ్రి కల్ల ముందు చేర
తెలిసేను ప్రేమ అంటె
ఆ తల్లి కి నా తండ్రి కబురు చెప్పి
నా తండ్రికి మా తల్లి చేరే దారి చెప్పి
మనసుల మధ్య సేతు కట్టిన
మర్కట కిషొరమ సుందరం చెస్తివే అందరి మనసులు
అతి సుందరం నీ కథ సారం