ప్రీతికర పిండివంటల స్మృతి
ప్రీతికర పిండివంటల స్మృతి


అందరికి ఉండెను పిండివంటలపైన ప్రీతి,
ప్రతి రుచి కలిగించెను ఒక మధురానుభూతి |౧|
అమ్మగారి వంటశాల నుండి వచ్చెను ఘుమఘుమలు,
మరువలేను మమతతో వడ్డించిన ఆమె చేతి వంటకాలు |౨|
ఎంతో రుచికరం కార్తీక సోమవారం భోజనం,
అమ్మగారు తప్ప ఎవ్వరు వండలేరు అలంటి భోజనం |త్రీ|
మా అమ్మమ్మగారి పాకశాలలో ఎప్పుడూ కనిపించెను శుచి శుభ్రత,
ఆవిడ వండిన క్షీరాన్న పులిహోర దద్యోజనాల చవిలో కనిపించెను ఏకాగ్రత |౪|
ఎంతో ప్రీతికరం మట్టి కుండలలో పూరి జగన్నాథ స్వామి మహాప్రసాదం,
నోరు ఊరించెను తిరుమల వెంకన్న స్వామి వారి లడ్డూ ప్రసాదం |౫|
ఎంత చెప్పినా తగ్గదు ప్రీతికర పిండివంటల స్మృతి,
మనసుకి వంటల రుచి నచ్చేసరికి మొదలయ్యెను సురమ్య స్తుతి |౬|