STORYMIRROR

Kadambari Srinivasarao

Classics

5  

Kadambari Srinivasarao

Classics

అంశం: గురుదేవోభవ

అంశం: గురుదేవోభవ

1 min
720

శీర్షిక: *జ్ఞాన భాస్కరం*

అజ్ఞానపు చీకట్లు తొలగించి జగతిని

జాగృతం చేసే జ్ఞాన భాస్కరం

శిష్యుగణ మెదడు పొలంలో 

అక్షర విత్తులు నాటి

పదాల రాశులతో వాక్యాల పంటను

నిర్విరామంగా పండించే హాలికుడు 

తెలివితేటల వెలుగుల జ్ఞానదివిటీ

అజ్ఞానులకు ఆశాదీపం

విజ్ఞానులకు విజ్ఞాన బాండాగారం

ప్రగతిబాట నడిపించే చైతన్య రథం

గెలుపు తీరాలకు చేర్చే రథ సారథి

నాలుగు మూలల మధ్య నడత నేర్పి 

నలుదిశలా విస్తరింపజేసే ఘనుడు

సకల జ్ఞానాన్ని ప్రసాదించే కల్పతరువు

కార్య సాధన ఎంత కఠినమైన

సరసన నిల్చి విజయాన్ని సాధించడంలో        చేయినందించే నరరూప దైవం

నేర్వడంలో వేసే తప్పటడుగులను సరిచేస్తూ మాతృమూర్తి వలే

జీవితాన్ని చక్కదిద్దడంలో పితృసమానుడై

శిష్యుని గెలుపును కాంక్షించి

సాదరంగా ఆహ్వానించే 

గమ్యపు గుమ్మం గురుదేవుడే!

జీవన పోరాటంలో గెలవటానికి

అక్షరాస్త్రాలు సమకూర్చే భూలోక పెన్నిధి

బతుకు బండిని గమ్యానికి చేర్చే మార్గదర్శి



Rate this content
Log in

Similar telugu poem from Classics