స్వాహా... మోహిని
స్వాహా... మోహిని


కలిపేస్తుంది ప్రపంచాన్ని
కదిలిస్తుంది హృదయాలని
సమ్మేళనాల వాణి
సాకేంతికతకు రాణి
కుర్రకారుకు మోజుగా!
కర్రపట్టిన వారూ వీడరుగా!?
అదే దీని ప్రత్యేకత!
ప్రస్తుతం ప్రపంచానికి ఇదే అంతా!
అరచేతిలో ఒదిగిపోయే ప్రేయసి
అదే మన ప్రాణాలు తోడే రాకాసి
కాలాన్ని హరించే చరవాణి
సందేశాల పంపకంలో అగ్రశ్రేణి
యవ్వనాన్ని ఆవహించి
రీఛార్జి ఆహారంతో..
తన ఆకలి తీర్చుకుంటున్న
స్వాహా... మోహిని
సాంకేతికత ఉచ్చులో బిగిసి
అరచేతి ఆటబొమ్మకు బానిసగా
ఆండ్రాయిడ్ మత్తులో మునిగి
యువనేత్రం ఊపిరికి చరమ గీతం