STORYMIRROR

PRASHANT COOL

Romance Classics Fantasy

5  

PRASHANT COOL

Romance Classics Fantasy

తియ్యటి తరంగాలు

తియ్యటి తరంగాలు

1 min
456

తియ్యటి తరంగాలు

ఎప్పుడు?

మునుపెన్నడు ఎరుగని

ముసిముసి నగవులు

మోము వశమాయే

మనసులు పెనవేసుకున్నవని

కబురందిన మరు క్షణాన .!!

ఎక్కడ?

తిరిగొచ్చే తీరికలేని

తలపులు పర వశమాయే

ఇరువురికొరకే నిర్మితమైన

వింతైన లోకాన...!!

ఎలా?

యుగాలుగా సగం సగంగా,

సుదూరంగా ఉన్నా

ఎడబాటు ఎరుగక

మనగలగడం

కుదిరిందెలా గతాన ...??

ఎందుకు?

అందరి అంతరంగాల

అంతరిక్షంలో అంతమెరుగని

తియ్యటి తరంగాలతో

స్పందనల విందు అందించేందుకు

కలిసామా ఈ జగాన..!!

-మీ ప్రశాంత్



Rate this content
Log in

Similar telugu poem from Romance