గిలిగింతలు
గిలిగింతలు


ప౹౹
ఎదలో గిలిగింతలు సెలయేటి పులకరింతలు
సొదలేని సోయుగం కలలోనూ కలవరింతలు ౹2౹
చ౹౹
అదే కాలం కలిసిరానీ ఆ వలపే తెలుసుకోను
ఏదో జాలం చేయనీ మది తలపే కలసి పోను ౹2౹
మాటొకటి ఇచ్చాకా తన మనసొకటి నచ్చాక
చోటొకటి చూపాలి కొత్త ఆశొకటి కలిసొచ్చాక ౹ప౹
చ౹౹
పరువాల పండుగే పదహారు ప్రాయమే వచ్చి
విరహాల సందడే ఈడేరిన వయసులు మెచ్చి ౹2౹
కోరాక ఆ మనసు కొరవై మండులే కొంచెమైన
చేరాక తీరమూ చేర్పొకటి కావాలి అంచుపైన ౹ప౹
చ౹౹
వయసంటు వచ్చాక మనసంటి మండునులే
సొగసంటు నచ్చాక ఆ వలపంటి పండునులే ౹2౹
ఎదలోకి ఇక ఎదురేగి చెలరేగి చేరే పోవాలిలే
పొదలోకి పోదామని కోరికలే కోరేసి రావాలిలే ౹ప౹