Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Drama

4  

Ramesh Babu Kommineni

Drama

తీరం చేరాలని..

తీరం చేరాలని..

1 min
473


తీరం చేరాలని సంద్రంలోని ఆ అలలకెంత తపనో

తీరా చేరాకే తెలుస్తుంది తనే పతనం అయ్యానని

అవిశ్రాంత పోరాటమూ అలుపెరగని ప్రయత్నాలు

అవిరామ ఆరాటమూ నిరాటంక ఓ నిష్పలత్వము

ప్రపంచం నిద్రించినా ఫలితం ఏమాత్రము లేకున్నా

పంచభూతాల పకృతుల సాక్షిగా తీరమే లక్ష్యంగా

తీరం చేరాలని సంద్రంలోని ఆ అలలకెంత తపనో

తీరా చేరాకే తెలుస్తుంది తనే పతనం అయ్యానని


స్వాంతనలేని ఓ సామాన్యుడి సామాన్యమైన కల

స్వాంతమేలేని ఆ నిర్విశ్రాంత నిరాకారమయే అల

రెండూ ఒకటే.....

ఒకటి మానసిక ఆరాటం రెండోది పకృతి పోరాటం

మొదటిది నెరవేరనది మారుది మారని తగలాటం

తరతరాలుగ సామాన్యుడికి తెలుసు ఎన్ని కష్ఠాలో

తరంగాలకు తెలుసు కల్లోలాలతో జరిగే ఆనష్టాలు

అయినా...

తీరం చేరాలని సంద్రంలోని ఆ అలలకెంత తపనో

తీరా చేరాకే తెలుస్తుంది తనే పతనం అయ్యానని


అల కల పదసామ్యమే కాదు ఫలితసామ్యం కూడా

అది తీరం దాటిరాలేదు ఇది వాస్తవానికి నెరవేరదు

నిరంతర యానం నిర్విరామ దాహం ఆపయనంలో

తరం తరం గడిచినా జాడలేని ఆ లక్ష్యము కోసమే

తీరం చేరాలని సంద్రంలోని ఆ అలలకెంత తపనో

తీరా చేరాకే తెలుస్తుంది తనే పతనం అయ్యానని


(దక్షిణాఫ్రికా డర్బన్ సముద్ర తీరంలో అలలు చూస్తూ 


Rate this content
Log in