Ramesh Babu Kommineni

Romance

4.5  

Ramesh Babu Kommineni

Romance

ఊరికే వింటావా..

ఊరికే వింటావా..

1 min
430


ఊరకే వింటావా ఊ కొడుతూ మాటాడకనే

మారకే మనసా మరి జ్జాపకాలు వేటాడగనే

జాను తెలుగులో జాజిమల్లెల సోయుగము

జాణ కులుకులో జాబిలి వెన్నెల ఆ నగము

విశదీకరించనా వలపు కథనమే విపులంగా

వశీకరించనా తలపు తమకంతో పదిలంగా

ఊరకే వింటావా ఊ కొడుతూ మాటాడకనే

మారకే మనసా మరి జ్జాపకాలు వేటాడగనే


జంట కోయిలలు జాగులేని ఆ కూజితాలు

పంట పైరులకు పల్లవించే పచ్చని గీతాలు

తెలవారి నులి వెలుగులో ఆ గిలి గింతలు

తొలిసారి తరుణి ఎదలో ఎలమి వింతలు

ఊరకే వింటావా ఊ కొడుతూ మాటాడకనే

మారకే మనసా మరి జ్జాపకాలు వేటాడగనే



పద కదనము పనస తీవలు పాల తేనెలగా

సుధ వదనము సుందర దృశ్య వేణువులగా

రాగ చయము రవళించి రంజిలు కవనమూ

భావ ద్వయము మదిలో కదిలే పయనమూ

ఊరకే వింటావా ఊ కొడుతూ మాటాడకనే

మారకే మనసా మరి జ్జాపకాలు వేటాడగనే


Rate this content
Log in