STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

రాత్రి కల

రాత్రి కల

1 min
394

రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది

ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది

కల అంటే కల కాదులే అదో కల్లోలమే

అలలాంటి వలపుల మది ఉల్లోలమే


చెప్పి రాదులే చెరుగని ప్రేమ ఎపుడు

కప్పి ఉంచ లేవులే కల చెదిరినపుడు

వచ్చిన వసంతమే వనాలకే సొంతం

తెచ్చినే వలపుపంతమే ఎద సాంతం

రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది

ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది


అలలా కలల శృంకలమే కట్టిపడవేసే

చెలిలా చెలరేగి చిన్నగా అడ్డుకట్టవేసే

ఊహలన్నీ ఊపిరి పోసుకొని ఊరేగా

సహనాలన్నీ సరసమే మార్చే తీరెగా

రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది

ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది

కల అంటే కల కాదులే అదో కల్లోలమే

అలలాంటి వలపుల మది ఉల్లోలమే


కదిలిన మేఘమై ఆ కల కురిసిపోవాలి

పలికిన రాగమై ఆలకించ మురిసిపోవాలి

పురివిప్పిన మయూరమై పులకించి పోవాలి

గరితప్పిన గుండె లయలకు వినిపించిపోవాలి

రాత్రి కల ఒకటి మనసులోనే మారాము చేసింది

రాత్రి కల ఒకటి ...హా.. హా... హా...

రాత్రి కల ఒకటి....









Rate this content
Log in

Similar telugu poem from Romance