అలిగినవేళ ప్రేయసి అందాలు
అలిగినవేళ ప్రేయసి అందాలు


ప్రియసఖి !
అభిసారికావై నీవలిగిన వేళ వెనుదిరిగి నను చూపక దాచిన నీ నగుమోము, ఆపై జాజి తీగలా వ్రేలాడే నీ ముంగురులు, నా రాకకై ఎదురు చూసి అలసిన నీ కమలాక్షులు, కాశ్మీరీ కాంతకైనా లేని సిగ్గుతో ఎరుపెక్కిన నీ చక్కిళ్లు
విరహంతో బుసలు కొట్టే సంపంగి మొగ్గలాంటి నీ నాసికం
ఉడుత దొండపండని భ్రమించే నీ అధరాలు
అమృత కలశాలను బోలిన నీ కుచకుంభములు
దాచినంత నాకు మోక్షము కలుగదటే ?
గంగను ఏ వొడ్డున మునిగినా కలుగును మోక్షమన్నట్లు
మల్లితీగ నంటి మణినాగులా వ్రేలాడే నీ నల్లని వాల్జెడ,
సడ్రుచులతో వడ్డించిన విందులా పసందైన నీ వయ్యారి
నడుము ,
స్తనద్వయాన్ని మరిపించి మురిపించే నీ జఘనములు,
ఆపై వ్రేలాడే నీ జడ గంటలు కన్న
నాకు కలుగదటే మోక్షము....నా ప్రియమదనా! శశివదనా!
******💐******