Ramesh Babu Kommineni

Romance

4.9  

Ramesh Babu Kommineni

Romance

వేడికోలు

వేడికోలు

1 min
637


ప౹౹

వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా

మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా ౹2౹


చ౹౹

అలసిన మనసుని కదిపేసి కను మరుగేలా

కావలసిన వలపును పంచక పయనమేలా ౹2౹

ఎదురు చూసిన ఎదకు ఎదురు చూపులేన

చెదిరిన చెలిమికి మిగిలేది చెమరే కనులేన ౹ప౹


చ౹౹

కన్న కలలని కాలరాచేసే కర్కశమేలా ఇలా

ఉన్న పళంగా ఊసులనూ చెరిపేసేసి అలా ౹2౹

అల్లుకున్న ఆశలూ ఆవిరి అవ్వాల్సిందేనా

చెప్పుకున్న బాసలు చెదిరి పోవాల్సిందేనా ౹ప౹


చ౹౹

జీవితానికి వెలితేనా ప్రేమించినా పాపానికి

భవితన్యానికి భరోసా లోపించేనే శాపానికి ౹2౹

మరలి మదిలో రగిలించిన కోపాన్నీ మరచి 

మరులూ చిగురించనీ హృదయాన్ని తెరచి ౹ప౹



Rate this content
Log in