STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

మల్లెలు కురిసి....

మల్లెలు కురిసి....

1 min
375

మల్లెలు కురిసి మనసులు కలిసి మంచులా ఒరిగిలే

వెన్నెల మురిసి వెన్నలా కరిగి ఎదలు రెండు కలిపిలే


భావాలే అక్షరాలై ఆశ్రయించినే పెదవులనే ఉచ్చరించను

ఆవేశాలే అలజడిరేపి ఉద్భవించే కనులతో

హెచ్చరించను

పరువాలు పల్లవించె ప్రాయంలో ముచ్చట్లై

మురిపించను

సరసాలు సరాగాలై సల్లాపములుగా గుచ్చే

వివరించను


మల్లెలు మురిసి మల్లెలు మురిసి విరిసెనే

అల్లిన ఆశలూ అలలు అలలుగా కురిసెనే

మల్లెలు మురిసి మల్లెలు మురిసి విరిసెనే

అల్లిన ఆశలూ అలలు అలలుగా కురిసెనే

మల్లెలు కురిసి మనసులు కలిసి మంచులా ఒరిగిలే

వెన్నెల మురిసి వెన్నలా కరిగి ఎదలు రెండు కలిపిలే



వచ్చిన వసంతం వలపంతా వాకిటను చేర్చగా

నచ్చిన మనసంతా నవనీతమై రాగం కూర్చగా

ఎన్ని ఎన్ని హొయలో ఎడదంతను ఏమార్చగా

కొన్ని కొన్ని మాయలే కొత్త మర్మమును నేర్చగా

మల్లెలు కురిసి మనసులూ కలిసి మంచులా ఒరిగిలే

వెన్నెల మురిసి వెన్నలా కరిగి ఎదలు రెండూ కలిపిలే



వెన్నెలవేళ పున్నమి కలిసి పూలపరువమాయే

అన్యులులేని ఏకాంతమే అదనులోవరమాయే

కదిలే హాయిని కథలా ఈ రేయిని నడిపించవా

మదిలో మారని గుర్తునే పచ్చలా పొడిపించవా

మల్లెలు కురిసి మనసులూ కలిసి మంచులా ఒరిగిలే

వెన్నెల మురిసి వెన్నలా కరిగి ఎదలు రెండూ కలిపిలే



Rate this content
Log in

Similar telugu poem from Romance