STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

ప్రేమ దీపాలు

ప్రేమ దీపాలు

1 min
123


ప౹౹

గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు

వచ్చి వచ్చి వలపు వరదా లేకనేపో తీరికలు ౹2౹


చ౹౹

వసంతాలు సంతసాలు పూచెనే పున్నమిని 

దిగంతాలు దివ్యముగ రప్పించెనే పౌర్ణమిని

అసలయిన అందానికి ఘనమైన స్వాగతం 

సిసలయిన బంధానిదే స్తిరమైన మనోగతం ౹ప౹


చ౹౹

ఊహించిన వలపుల తలపులే ఉసిగొల్పెనే 

సాహసించిన సమవుజ్జీతో ఆ కసి నిల్చునే ౹2౹

సమరమో ప్రణయమో కలిసి గెలిపించాలి

అమరమై నిలిచి ఆశతో కలిపి కనిపించాలి ౹ప౹


చ౹౹

అలసిన గుండెలను ఆదమరచి ప్రేమించనీ 

కలసిన ఆ మనసులనే కలసి పయనించనీ ౹2౹

కోరిక గుర్రాలకే మరి కళ్ళాలనే తొలగించనీ

విభావరిక మదిలో ప్రేమదీపాలే వెలిగించనీ ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance