End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Varanasi Ramabrahmam

Romance


4.2  

Varanasi Ramabrahmam

Romance


కలసిన మనసులు

కలసిన మనసులు

1 min 687 1 min 687


కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు

వలపులో తీయని సలుపులో మాధుర్యపు మొలకలో


హత్తుకున్న హృదయమ్ముల రసానందములు

పున్నమి చందమామ ప్రసరించు చల్లని వెన్నెలలో

విరిసీవిరియని మల్లెమొగ్గల గుబా ళిoపులో

మనసులపై జల్లబడిన పన్నీటిజల్లులో

 

గలగల పారేటి సెలయేటి నీటిజాలులో

ఎత్తులపల్లముల ఎక్కి దూకు జలపాతములో

ఎడతెరపిలేక ఎగసిపడు అలలవరుసలో

మౌగ్ధ్యమున పొడసూపు ప్రమోదములో

 

ప్రేమబంధమున ముడివడిన నెయ్యంపు తలపులు

హృదయసీమల విహరించు స్నేహరస హరిణములో

వెన్నెల పూరేకుల మెత్తదనము మార్దవము సౌరభముల

పుణికిపుచ్చుకున్న ప్రణయంపు పూమాలికలో

 

కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు

వలపులో తీయని సలుపులో మాధుర్యపు మొలకలో

******Rate this content
Log in

More telugu poem from Varanasi Ramabrahmam

Similar telugu poem from Romance