సరళ పూజనం
సరళ పూజనం


పరమాత్ముడు తననెవరు పూజించారు, ధ్యానించారు చూడడు;
తన ధర్మం నిర్వర్తిస్తూ నీతిగా బ్రతుకుతున్నాడా
లేదా చూస్తాడు;
అయినవారికి అభిమానం, ఆప్యాయతలు అందిస్తున్నాడా, అందుకుంటున్నాడా, లేదా
చూస్తాడు;
ఆయనకి కావలసినది మన మనసు;
పటాటోపాలు, ఆడంబరాలు నిండిన
దర్శనాలు, హడావుడులు కాదు;
ఆయనకేం కావాలి!
మనసారా అర్పించే
ఫలం, పత్రం, పుష్పం, తోయం చాలు;
కాని మన అహాన్ని తృప్తి పరుచుకోవడానికి
ఏదో చేస్తాం; ఏదో రాస్తాం; ఏదో ఉపన్యసిస్తాం;
పాండిత్యం కన్న హృదయనివేదనం
అందుకుని కటాక్షించిన శ్రీకాళహస్తీశ్వరుడు,
శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు మనకు ఉదాహరణలు;
మనం వింటే, అర్థం చేసికుంటే, ఆకళింపు అయితే;
లేకపోతే పూజలు పునస్కారాల యావలో పడి
పరంధాముని బయట కొలుస్తాం; ఆయన అంతర్యామి అని మర్చిపోతాం; పరమాత్మయే
స్వయంగా చెప్పినా సరళ పూజావిధానం మెచ్చం
మన ఆధ్యాత్మికత మన దర్పం చూపించడానికి కాదు;
పరమపురుషునియందు శరణాగతి చెంది
ప్రపత్తి చూపుటకు;