STORYMIRROR

Dinakar Reddy

Classics

5  

Dinakar Reddy

Classics

జన్మానికో శివరాత్రి

జన్మానికో శివరాత్రి

1 min
590

అమృతమును కోరి

పాల సంద్రాన్ని చిలికినారంట దేవతలు రాక్షసులు

హాలాహలమను కాలకూట విషము పుట్టెనంట

పరుగు తీసినారంట అందరూ పరమేశుని శరణు వేడినారంట


విషము మ్రింగి శివుడు లోకాలు కాచినాడంట

అమృతం తాగినోళ్లంతా దేవతలైతే

నా దేవుడు విషం తాగి

దేవతలకే దేవుడు

మహాదేవుడు అయినాడంట

అదే మహాశివరాతిరంట


మాఘ కృష్ణ పక్ష నడిరాతిరిన

ఆది అంతాలు లేని జ్యోతితో లింగముగా ఉద్భవించినాడంట

ఎవరు గొప్ప అని వాదులాడుకున్న

బ్రహ్మ విష్ణువుల తగువు తీర్చినాడంట

నా సామి


ఏదడిగితే అది ఇచ్చే

భోళాశంకరుడంట

జన్మానికో శివరాత్రంట

నమ్మి నువ్వు మారేడాకులు

శివలింగము మీద పెట్టి మ్రొక్కమంటా

నీకు తోడు శివుడు వస్తాడంట


హర హర మహాదేవ

శంభో శంకరా అని

ఉపవాసం జాగారం చేసి చూడు అంటా

మహాదేవుని మనసు గెలుసుకో అంటా


Rate this content
Log in

Similar telugu poem from Classics