దాక్కుని తిరుగుతూ..
దాక్కుని తిరుగుతూ..
ఒకే షర్ట్ మళ్ళీ వేసుకుని కనిపిస్తే
చిల్లర లేదని చెప్పేస్తే
మధ్యాహ్నం ఆకలి వేయట్లేదు అంటూ
తోచిన అబద్ధం చెప్పి
రోజులు గడిపేస్తే చాలు
కానీ పేదరికం దాగదు కదా
అంటూ అనుకుంటూ
ఇంకో రాత్రి గడుస్తోంది
వెలుతురు బాకీ ఉంది..