హమ్మయ్య అనుకుందామంటే..
హమ్మయ్య అనుకుందామంటే..
ఏంటి నీకింకా అంత నమ్మకం
మళ్లీ ఓసారి కలుస్తామని
ఉత్తర దక్షిణ ధృవాలం
అని నీకే బాగా తెలుసు కదా
కవిత్వం కలుపుతుందా
కాదన్నా నిన్ను నా దగ్గరికి తీసుకుని వస్తుందా
అది కూడా మార్చి మరీ
ఏమో
ఇంక ఓపిక లేదయ్యో
హమ్మయ్య అనుకుందామనుకుంటే
మళ్ళీ ఏదో డౌట్ కొట్టేస్తుంది
నువ్వు కానీ వస్తున్నావా
లేదులే
ఏదో భ్రమ అయ్యుంటుంది