జన్మనిచ్చా నా స్వాతంత్య్రానికి
జన్మనిచ్చా నా స్వాతంత్య్రానికి


తెలుపు నలుపు అనే
వర్ణ బేధాల నుంచి
విడదీసి చూడమనే
జాతి విద్వేషాల నుంచి
అణగదొక్కబడ్డాం అని
చూసే జాలి చూపుల నుంచి
మీ భాషకు అస్తిత్వం ఏదని
అడిగే ప్రశ్నల నుంచి
అంతా బాగుంది అని చెప్పే
అబద్ధాలలోంచి
నువ్వు ఏమీ చెయ్యలేవు
అనే సమాజపు నిరాసక్తత నుంచి
వర్గ పోరు లోంచి
విచ్చుకున్న హింసా వాదంలోంచి
రక్తాన్ని ధారపోసి
స్వాతంత్య్రాన్ని తెచ్చిన
సమర యోధుల కలల్లోంచి
ఈ పుణ్య భూమిలోంచి
నా లోంచి నేను
స్వతంత్రానికి జన్మనిచ్చాను
స్వేచ్ఛగా ఆలోంచించి
ఈ కవిత వ్రాశాను.