STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Inspirational

5  

VENKATALAKSHMI N

Abstract Fantasy Inspirational

కవిత్వం

కవిత్వం

1 min
380

కవిత్వం ..


మనసు లోతుల్లోంచి

ఉబికి వచ్చే లావాలా వుండాలి


సమున్నత శిఖరాల నుండి

జాలువారే జలపాతంలా

హోరెత్తాలి


పదం పదం నర్తిస్తూ

ఒక లయపూరితమైన ధ్వనితో

ఊగిపోవాలి


పసితనపు సున్నితత్వము

నుసితనపు కర్కశత్వమూ

జోడించబడి నిజాలను

నిర్భయంగా ఎండగట్టాలి


ఊహాశక్తి యొకటే కాదు

కల్పనాశక్తికి తాత్వికతను

జోడించే నైపుణ్యం కలిగి వుండాలి


అనుక్షణం నూతన పదజాలంకై

అన్వేషిస్తూ రసజ్ఞులను

కట్టిపడేసే చాతుర్యం సొంతం కావాలి


అభివ్యక్తి భావప్రకటన

స్వేచ్ఛను స్వచ్ఛతను కలిగివుండి

పాఠకుల హృదయానికి చేరువకావాలి


మనసుతో యుద్ధం చేస్తూ


Rate this content
Log in

Similar telugu poem from Abstract